Thursday 10 April 2014

మే రెండో వారంలో టెన్త్ ఫలితాలు.. మూడో వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ

హైదరాబాద్: వచ్చే నెల రెండో వారంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ప్రకటించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మే మూడో వారంలోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చింది. మొత్తానికి జూన్ 2వ తేదీలోగా పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన కార్యక్రమాలను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావానికి అపాయింటెడ్ డే అయినందున.. ఆలోగానే ఈ ఫలితాలను, పరీక్షలను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అలాగే పాఠశాల విద్యాశాఖ విభజన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ పరీక్షల విభాగాన్ని కూడా విభజించకతప్పడం లేదు. సాధారణంగా మే 20వ తేదీ వరకు పదో తరగతి పరీక్ష ఫలితాలను ప్రకటించి జూన్ మొదటి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రక్రియను ముందుగానే నిర్వహిస్తున్నారు. ఈనెల 16 నుంచి 29 వరకు మూల్యాంకనం చేపట్టాలని ఇదివరకే నిర్ణయించారు.

1 comments: